గుంటూరు శారదాకాలనీకి చెందిన గుమ్మడి భారతి చేసిన స్థల వివాద ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న కార్యాలయంలో హాజరుకావాలని తెలిపారు. రోశయ్య అక్రమంగా భూమి కబ్జా చేశారని, 2009లో భర్తను కారుతో ఢీకొట్టించారని భారతి ఆరోపించారు. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు.