గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఆత్మకూరు శివారు ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఐదుగురు యువకులని మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ బుధవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అక్కడే కౌన్సెలింగ్ నిర్వహించి కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం బహిరంగ మద్యపానం నిషేధమని కాదని ఎవరైనా బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.