
భారత జవాన్‌ను చిత్రహింసలకు గురిచేసిన పాక్
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా 21 రోజుల తర్వాత పాక్ కస్టడీ నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. కస్టడీ సమయంలో అతడిపై పాక్ అత్యంత దారుణంగా వ్యవహరించిందని భారత సైనికాధికారులు తెలిపారు. మూడు వారాల పాటు కళ్లకు గంతలు కట్టి సెల్లో ఉంచి, నిద్రపోకండా చేశారని, నిత్యం దూషిస్తూ మానసికంగా వేధించారని, పళ్ళు తోముకోవడానికి కూడా అనుమతించలేదని చెప్పారు.