తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో మంగళవారం ల్యాండ్ పూలింగ్ పై ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆర్డీఓ, తహశీల్దార్లు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిచంద్రపురం లోని రైతులు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ముందు రాజధాని కొరకు భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు వారి సమస్యలను పరిష్కరించాలని హరిచంద్రపురం రైతులు కోరారు.