పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమంగా రేషన్ బియ్యం తరలించే వారి ఆగడాలు ఆగటం లేదు. శనివారం అర్ధరాత్రి సమయంలో తుళ్లూరు మండలంలోని పలు గ్రామాల నుంచి రేషన్ బియ్యాన్ని యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల కళ్లు గప్పి అక్రమార్కులు రేషన్ బియ్యం మాఫియాగా చేస్తూ, స్థానిక ఎమ్మెల్యే ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.