మంగళగిరి నగరంలో మంగళవారం తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ బాషా తెలిపారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్నిరోజుల కాలం నుండి వాల్వ్ ట్యాంక్ పైపులైన్ పనులు జరుగుతున్నాయి. ప్రజలకు తాగునీటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. బుధవారం నుంచి యథావిధిగా నీటి సరఫరా కొనసాగుతుందని వెల్లడించారు.