మహాత్మ జ్యోతిరావ్ పూలే 134వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, పూలే అనేక సామాజిక ఉద్యమాల నేతగా, మహిళలకు విద్యా అవకాశాలు, సమాన హక్కులు కావాలని పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళల విద్య కోసం చేసిన కృషిని ప్రశంసించారు.