లోక్ అదాలత్లో 143 కేసులు పరిష్కారం

59చూసినవారు
లోక్ అదాలత్లో 143 కేసులు పరిష్కారం
నరసరావుపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్లో 143 కేసులు పరిష్కరించినట్లు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యశ్రీ తెలిపారు. పట్టణంలో శనివారం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ చైర్మన్ సత్య శ్రీ ఆధ్వర్యంలో న్యాయాధికారులు మూడు బెంచీలుగా ఏర్పడి రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించారు. సహకరించిన న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్