తుళ్లూరు మండలంలోని మందడం సీడ్ యాక్సిస్ రోడ్డుపై ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. వెంకటపాలెం టీటీడీ ఆలయం నుంచి వస్తున్న కారు, వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.