తెనాలిలో ఆదివారం స్వాతంత్య్రం సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతిని నిర్వహించారు. బీజేఆర్ కమిటీ, పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి జగ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.