కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నరసరావుపేటలో సోమవారం అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ నాయకులు రాంబాబు మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. సీపీఐ నాయకులు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.