16న గుంటూరులో ఉద్యోగ మేళా

82చూసినవారు
16న గుంటూరులో ఉద్యోగ మేళా
గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 16న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి. దుర్గాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిసర ప్రాంత యువత ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేళా జరుగుతుందని తెలిపారు. వివరాలకు 98668 22697 నంబరును సంప్రదించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్