మంగళగిరి: అంగన్వాడి పిలుస్తోంది పై అవగాహన ర్యాలీ

74చూసినవారు
మంగళగిరి: అంగన్వాడి పిలుస్తోంది పై అవగాహన ర్యాలీ
మంగళగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కొత్తపేట ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పరిధిలో మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్ హేమలత, విజయలక్ష్మి, సచివాలయం మహిళా పోలీస్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్