గుండ్లపల్లి ప్రధాన రహదారి జడ్పీహెచ్ స్కూల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ప్రజలు శుక్రవారం ఆరోపిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయానికి ముగ్గు వేసి పసుపు, కుంకుమ నిమ్మకాయలతో కనిపించింది. వాటిని చూసి విద్యార్థులు భయందోళన చెందారు. ఇలాంటివి మరలా జరగకకుండా చూడాలని ప్రజలు కోరారు. అటు ఇది ఆకతాయిలు చేశారా మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.