నరసరావుపేట పట్టణం భువన్ చంద్ర టౌన్ హాల్లో ఈనెల 30న ఉదయం 10: 30 గంటలకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీఎం విశ్వకర్మ రుణాల మంజూరుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎంపీ కార్యాలయ సిబ్బంది గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తిగల నిరుద్యోగులు, యువతీ, యువకులు హాజరవ్వాలని ఎంపీ కార్యాలయ సిబ్బంది సూచించారు.