నరసరావుపేట: అక్రమ వడ్డీ వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: పిడిఎఫ్

82చూసినవారు
పిడిఎం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ గురువారం నరసరావుపేటలో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసన్ చిట్ ఫండ్స్ పేరుతో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న చల్లా శ్రీనివాసరావు, పల్లా నాయుడు బాబు తదితరులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అధిక వడ్డీలతో ప్రజలను దోచుకుంటున్నారని, అవి కట్టలేక బాధితులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత పోస్ట్