2024-25 లో ఉల్లాస్ కార్యక్రమం మొదటి విడత ద్వారా జిల్లాలో చదవడం, రాయడం రాని 10,707 మందిని అక్షరాస్యులను చేశామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో 30వేల మంది విధాన, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యులను తయారు చేయాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉల్లాస్ పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.