గడచిన 5 ఏళ్ల లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వం చేసిన భారీ భూ కుంభకోణాన్ని లోక్ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లేవనెత్తారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో జీరో అవర్ లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై ఎంపీ కృష్ణ దేవరాయలు గళం విప్పారు. 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా ఫ్రీహోల్డ్ గా మార్చారనీ దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 14,831 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.