నరసరావుపేట మండలం చిన్న తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ వసీమా నీట్ పరీక్షలో గణనీయ విజయాన్ని సాధించింది. ఆమెకు శనివారం ఆల్ ఇండియా ర్యాంక్ 1184, ఈ డబుల్ ఎస్ కేటగిరీలో 80వ స్థానం లభించింది. పదో తరగతి వరకు నరసరావుపేటలో, ఇంటర్ గుంటూరులో వసీమా చదివింది. ఆమె తల్లిదండ్రులు షేక్ నబి సకినా, షేక్ సాప మహబూబ్ సుభాని ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే.