వైఎస్ జగన్ కాన్వాయ్ పై దాడి చేయడం సరైన పద్ధతి కాదని బుధవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేట లో మాట్లాడుతూ పొగాకు కొనుగోలు జరగడంలేదని రైతులను పరామర్శించేందుకు ఆయన పొదిలి వెళ్లారన్నారు. ఆయన కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులు వేయడం, చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజధాని విషయంపై మాట్లాడారని ఆయనను పథకం ప్రకారం అంతమొందించాలని చూస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు.