నరసరావుపేట: రక్తదానంపై అవగాహన ర్యాలీ

66చూసినవారు
నరసరావుపేట: రక్తదానంపై అవగాహన ర్యాలీ
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేటలో ప్రభుత్వ ఏరియా మాతా శిశు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్, డాక్టర్ మంత్రి నాయక్, డాక్టర్ దయానిధి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రక్తదానం ద్వారా ఆప్తుల ప్రాణాలు రక్షించవచ్చని డాక్టర్ మంత్రి నాయక్ తెలిపారు. ప్రజలలో రక్తదానంపై అవగాహన పెంపొందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్