కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు ఎంత మంది లబ్దిదారులుకు, ఎ బ్యాంకు ఎంత రుణాలు ఇచ్చాయో సవివరంగా నివేదికలు రూపొందించాలని కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు సంబందిత లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాం ప్రసాద్ ను కోరారు. గురువారం నరసరావుపేటలోని కలెక్టరేట్లో డిసెంబర్-2024 త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డియల్ఆర్సి పై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.