నరసరావుపేట: మహిళ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు

78చూసినవారు
నరసరావుపేట: మహిళ హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు
పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసిన మహిళ హత్య కేసులో దారుణ కిరాతక నేరస్తుడు తన్నీరు అంకమ్మరావు అలియాస్ ముళ్ల పంది(30), శివసంజీవయ్య కాలనీ, నరసరావుపేటకు చెందినవాడు ఉరిశిక్ష విధించబడ్డాడు. ఈ మేరకు 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నేతి సత్యశ్రీ గురువారం తీర్పును ప్రకటించారు. 2023 మే 5 ఉదయం లాల్ బహుదూర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని సాంబశివ ఫర్నిచర్ షాప్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం రక్తమడుగులో కనిపించింది. తొలుత ప్రమాదంగా అనుమానించిన పోలీసులు, CCTV ఫుటేజ్ విశ్లేషణలో అసలైన నిజాన్ని బయటపెట్టారు.

సంబంధిత పోస్ట్