దేవుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతారని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడా అరవింద్ బాబు అన్నారు. శనివారం శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోవుల సహజ మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.