పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. టీ స్టాల్ లో వినియోగిస్థున్న లూజ్ పాలు, టీ పొడి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు, మజ్జిగా ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, బాదంపాల ముగింపు తేదీలను తనిఖీ చేశారు.