నరసరావుపేట: ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ: కమిషనర్

72చూసినవారు
నరసరావుపేట: ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ రాయితీ: కమిషనర్
నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీని 50శాతం ఇవ్వడం జరిగిందని కమిషనర్ జస్వంత్ రావు శుక్రవారం తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు బకాయిని ఏక మొత్తంలో చెల్లించే వారికి ఈ అవకాశం ఉంటుందన్నారు. మార్చి నెలలో సైతం బకాయిలపై 50శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేశారు. చెల్లింపులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్