నరసరావుపేట పట్టణంలోని ఓ మీ సేవ కేంద్రం యాజమాన్యం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. ఆధార్ అప్‌డేట్ వంటి సేవల కోసం ప్రభుత్వ ఫీజుకంటే అధికంగా వసూలు చేస్తూ 200 ఇస్తే గంటలో చేస్తాం అని చెప్పి అవినీతి ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రశ్నించిన స్థానికులను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సోమవారం ఈ వ్యవహారాన్ని ప్రజలు మీడియాలోకి తీసుకువచ్చారు.