నరసరావుపేట: పోగొట్టుకున్న ఫోన్లు అందజేత

80చూసినవారు
నరసరావుపేట: పోగొట్టుకున్న ఫోన్లు అందజేత
సుమారు 31. 22 లక్షల విలువైన 223 దొంగిలింపబడిన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పల్నాడు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు గురువారం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయము నందు బాధితులకు ఫోన్లు అందజేశారు. ఎవరైనా ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఎడల వెంటనే సిఈఐఆర్ వెబ్ సైట్ నందు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా పోలీసులకు భాదితులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్