నరసరావుపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

75చూసినవారు
నరసరావుపేట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నరసరావుపేటకూ చెందిన వెంకట నాగేశ్వరరావు (50) జీవిత బీమా ఏజెంట్ గా పనిచేసేవారు. ఈ నెల 10న ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తూ అదుపుతప్పి కిందపడ్డారు. స్వల్ప గాయాలైన ఆయనను కుటుంబసభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర వైద్యం నిమిత్తం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్