నరసరావుపేట పట్టణంలోని నారాయణ కళాశాల ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులు గురువారం నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ శాసనసభ్యులు డా"చదలవాడ అరవింద బాబు ను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో ఆప్యాయంగా పలుకరించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.