నరసరావుపేటలోని చిలకలూరిపేట - గుంటూరు రోడ్డులోని పురపాలక సంఘ డంపింగ్ యార్డ్ ను శనివారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు డంపింగ్ యార్డ్ వలన వచ్చే పొగ, దుమ్ము, ధూళి వంటివి లేకుండా చేసేందుకు తీసుకుంటున్న చర్యలు వేగవంతం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావుతో ఫోన్లో మాట్లాడి పారిశుద్ధ్య పనులకు సంబంధించి ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు.