నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ. 9, 56, 038/- రూపాయల చెక్కలను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు అరవింద బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.