నరసరావుపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ శుక్రవారం ప్రయాణికులతో రద్దీగా మారింది. ఒకటవ ప్లాట్ ఫారం నుంచి చివరి వరకు ప్రయాణికులు బస్ సర్వీసుల కోసం పడి గాపులు కాశారు. నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో పాఠశాల స్థాయి నుంచి ఫార్మసీ, ఇంజనీరింగ్, బీఈడీ, నర్సింగ్, డిగ్రీ, జూనియర్ ఇంటర్ విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను శుక్రవారం నుంచి ప్రకటించారు. సొంత ఊర్లకు వెళ్లేందుకు విద్యార్థులతోపాటు ఉద్యోగులు పోటీ పడ్డారు.