ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గురువారం నరసరావుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు జడ్జి ఏ.సలోమి మాట్లాడుతూ, బాల కార్మికులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించి, సమాజం చైతన్యం కావాలని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి, బాలల హక్కులను పరిరక్షించాలని ఆమె సూచించారు.