నరసరావుపేటలో ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డ్ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ, వక్ఫ్ బోర్డ్ చట్టం ముస్లిం ఆస్తులపై అన్యాయం చేస్తోందని ఆరోపించారు. వారు ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలనీ, ముస్లింల ఆస్తులను కాపాడాలని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.