సాక్షి పత్రికను నిషేధించాలని కోరుతూ పల్నాడు జిల్లా తెలుగు మహిళలు నరసరావుపేట పట్టణంలో ఆదివారం భారీ ఎత్తున నిరసన తెలిపారు. తెలుగు మహిళలు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్టీ కార్యాలయం నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు.