నరసరావుపేట: కలెక్టరేట్ లో సంక్రాంతి సంబరాలు

1097చూసినవారు
నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులతో కోలాటం, నృత్య ప్రదర్శనలు, హరిదాసులు, గంగిరెద్దులతో విన్యాసాలు, భోగి మంటలు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ప్రసంగించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్