మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచమని ఎస్పీ కే. శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. ఆపదలో ఉన్న మహిళలు ఎస్ ఓ ఎస్ బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం పోలీస్ స్టేషన్ కు 112 నెంబర్ కు సమాచారం చేరుతుందన్నారు. యాప్లో వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. యాప్లో మహిళల హక్కులు, రక్షణ చట్టాల సమాచారం ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.