ముక్కోటి ఏకాదశి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని శుక్రవారం పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు శంకర్ నారాయణ ఎస్పీ దంపతులను సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దక్షిణావృత బంగారు శంఖు తీర్థం ఎస్పీ దంపతులకు అర్చకులు అందజేశారు.