పల్నాడు: ప్రభుత్వ సలహాదారుగా అంకారావు

66చూసినవారు
పల్నాడు: ప్రభుత్వ సలహాదారుగా అంకారావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా కొమెర అంకారావు (జాజి)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల పరిరక్షణ, పెంపకంపై ఆయన రెండేళ్లపాటు సలహాలు ఇవ్వనున్నారు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆయన, నల్లమల్ల అటవీ ప్రాంతానికి అంకితమై పని చేశారు. ఆయన 2 లక్షల ఎకరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, కోట్ల విత్తనాలు చల్లి సంరక్షణలో భాగమయ్యారు.

సంబంధిత పోస్ట్