పల్నాడులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్మించబోయే వాటర్ గ్రిడ్ పథకంలో మరో ముందడుగు పడిందని శుక్రవారం ఎంపీ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 1200కోట్లతో ఆన్ లైన్ విధానంలో టెండర్లకు ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులో సాగర్ నుంచి నీటిని సేకరించి, దగ్గరలో నీటిని ఫిల్టర్ చేస్తారన్నారు.