మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేట లో ఆయన మాట్లాడుతూ. హోలీ పండుగ సందర్భంగా సాంప్రదాయ రంగులు ఉపయోగించటం ఆరోగ్యకరమని అన్నారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని వివరించారు. ప్రధాన కుడళ్లు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉంచడంతో పాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.