పల్నాడు: సమస్యలకు ప్రత్యేక దృష్టితో పరిష్కారం చూపాలి: కలెక్టర్

80చూసినవారు
పల్నాడు: సమస్యలకు ప్రత్యేక దృష్టితో పరిష్కారం చూపాలి: కలెక్టర్
పల్నాడు జిల్లా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశాలు ఇచ్చారు. గురువారం నరసరావుపేట స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులకు సంబంధించి కచ్చితంగా శ్రద్ధ వహించాలన్నారు. జేసీ సూరజ్, ఆర్డీవో మధులత, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్