పల్నాడు: కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ

74చూసినవారు
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు, జూదం నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ పి. రామకృష్ణ హెచ్చరించారు. శనివారం మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగా సమాచారం ఇస్తే అటువంటి ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. బంగారం విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లల్లోనూ ఉంచాలని సీఐ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్