సాంకేతిక విద్యా శిక్షణా మండలి విడుదల చేసిన పాలిసెట్- 2025 ఫలితాల్లో గురువారం పల్నాడు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 3, 550 మంది విద్యార్థులు పరీక్షకు జిల్లా నుంచి హాజరయ్యారు. వీరిలో 2, 220 మంది బాలురు 1, 211 మంది బాలికలు ఉన్నారు. ఫలితాల్లో బాలురు ఉత్తీర్ణ శాతం 95. 48 శాతం గాను బాలికల ఉత్తీర్ణ శాతం 98. 86 శాతంగా నమోదు అయింది.