పెదకాకాని మండల పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ప్రభుత్వ భూముల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలిస్తామన్న హామీ నెరవేర్చాలని కోరారు.