
ఢిల్లీలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9 గంటల 4 నిమిషాల సమయంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.