ఎరువుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి కాలువలో బోల్తా పడిన సంఘటన రొంపిచర్ల మండలం ఇప్పర్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం నరసరావుపేట నుంచి కంభం వెళుతున్న లారీ రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి సమీపంలో కాలువ మలుపు వద్ద కాలువలోకి దూసుకు వెళ్లిందని తెలిపారు.