రొంపిచర్ల మండలం ఆరెపల్లి గ్రామంలో శనివారం గోకులం షెడ్లను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పథకాల ద్వారా పాడి పరిశ్రమ, పాడి రైతులను ప్రోత్సహించి పశువుల ఆరోగ్యం సంరక్షణ, పాల ఉత్పత్తి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ గోకులం పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.