మద్యం షాప్ లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. రొంపిచర్ల మండల కేంద్రంలోని వైన్ షాపును ఆయన తనిఖీ చేశారు. మద్యం సీసాలు, రికార్డులను పరిశీలించారు. రసాయన పరీక్షలు నిమిత్తం ఒక్కో సీసాను సేకరించినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నాటు సారాయి తయారు చేయడం నేరమని అన్నారు.